ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా ఒక్క సారి తొంగి చూడవా ఎన్ని దారులో అలా వాకిలాయెగా ఎద ఒక్క సారి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులె ఒక నింగెలే మనకున్నది నా కలల తోటలో మారని ఋతువులు ఉన్నవే నువ్వు వచ్చుండే చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే పదే పదే ఒకే రోజే మాదే
ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా ఒక్క సారి తొంగి చూడవా
ఆకాశం గుప్పిట్లో చిక్కెదేనా మేఘాలు హద్దులో ఉండేదేనా.. గుండెల్లో ఆగేవి కప్పేవెలా రెప్పలోనా ఆ మాత్రం నేనెంతో అర్థం కానా
నీ జడల పాయలో గుండె చిక్కుకున్నదే మరి రమ్మన్నా రాకున్నదే అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని ఒక జంజాటం చంపేస్తుందే..
గుండె తలుపు తట్టకు నిన్ను నాలో వెతకకు
న నా నా…
మాటే తేలేలోనా ఆపేస్తానా బాధ అయితే నీతోనే చెప్పెసేయనా నవ్వే అయితే నీ నుండి దాచేస్తానా దాచేస్తానా.. మనసయ్యె మౌనంగా ఏడుస్తున్నా
నీ జడల పాయలో గుండె చిక్కుకున్నదే మరి రమ్మన్నా రాకున్నదే అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని ఒక జంజాటం చంపేస్తుందే..
ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా ఒక్క సారి తొంగి చూడవా ఎన్ని దారులో అలా వాకిలాయెగా ఎద ఒక్క సారి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులె ఒక నింగెలే మనకున్నది నా కలల తోటలో మారని ఋతువులు ఉన్నవే నువ్వు వచ్చుండే చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే పదే పదే ఒకే రోజే మాదే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హేయ్.. ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హేయ్..Teksty umieszczone na naszej stronie są własnością wytwórni, wykonawców, osób mających do nich prawa.